ఐదుగురి మృతి, పోలీసుల అదుపులో నిందితుడు

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలో అన్నాపోలిస్‌ నుంచి ప్రచురితమయ్యే ‘క్యాపిటల్‌ గెజిట్‌’ దినపత్రికా కార్యాలయంలో గురువారం కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ‘గ్లాస్‌ డోర్‌ నుంచి గన్‌మెన్‌ ఒకరు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చాడు. ఒక్కసారిగా అక్కడి వారంతా భీతిల్లారు. భయంతో పలువురు బల్లల కింద దాక్కున్నారు’ అని ఫిల్‌ డేవిస్‌ అనే రిపోర్టర్‌ ట్వీట్‌ చేశాడు. అన్నాపోలీస్‌లో నాలుగు అంతస్తుల భవనంలో ఈ పత్రికా కార్యాలయం ఉంది. కాల్పుల సంఘటన అనంతరం పోలీసులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారం అందించినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

Related posts

Leave a Comment