ఐక్యరాజ్యసమితిలో బాబు ప్రసంగం జాడే లేదు.. అసలు ఆయన ఎక్కడ మాట్లాడతారు?: బీజేపీ నేత జీవీఎల్

ఐరాసలో 313 ఈవెంట్లు జరుగుతున్నాయి
అందులో బాబు ప్రసంగించే కార్యక్రమం లేనేలేదు
ఐరాస సమావేశాల జాబితాను ట్వీట్ చేసిన జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బాంబు పేల్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 313 కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, అందులో బాబు ప్రసంగించబోయే కార్యక్రమం లేనేలేదని తేల్చిచెప్పారు. ఐరాస అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబుకు సంబంధించిన కార్యక్రమం నమోదు కాలేదన్నారు. ఈ మేరకు జీవీఎల్ వరుస ట్వీట్లు చేశారు.

ఐరాస పర్యావరణ పరిరక్షణ విభాగం, బీఎన్‌పీ బరిబాస్‌, వరల్డ్‌ ఆగ్రోఫారెస్ట్రీ సంయుక్తంగా ‘సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు’ పేరుతో సదస్సును నేడు నిర్వహిస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోందని జీవీఎల్ అన్నారు. అసలు బాబు ప్రసంగ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదనీ, తెలిస్తే టీడీపీ నేతలు లింక్ ను షేర్ చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఇంతకూ మన గ్లోబల్ లీడర్ ఏ సదస్సులో మాట్లాడుతున్నారు?’ అని జీవీఎల్ వెటకారంగా ప్రశ్నించారు.

Related posts

Leave a Comment