ఐకియా హోం ఫర్నిషింగ్ స్టోర్‌ను ప్రారంభించిన కేటీఆర్

హైటెక్స్‌లో ఐకియా హోం ఫర్నిషింగ్ స్టోర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్, ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
అందరికి అందుబాటు ధరలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్టు ఐకియా రీటైల్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహంతో తొలి స్టోర్‌ను దిగ్విజయంగా ప్రారంభించగలుగుతున్నామని ఏర్పాటు చేయగలిగామని అన్నారు. దేశంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 2013 పొందిన ఐకియా ఇప్పటి వరకు రూ. 4,500 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు.

ఐకియా ప్రత్యేకతలు..

-13 ఎకరాల్లో 4 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ స్టోర్ కోసం రూ. 1000 కోట్లను వెచ్చింది.
-మొత్తం 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేస్తున్నారు. అందులో కనీసం సగం మంది మహిళలే.
-మొత్తం 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. అందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తున్నది.
-దాదాపు 1000 ఉత్పత్తులు రూ. 200 లోపే లభించనున్నాయి.
-ఇందులో లభించే టెక్స్‌టైల్ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ కాటన్‌తో తయారు చేసినవి.
-స్టోర్‌లో ఉన్న మొత్తం లైట్లు ఎల్‌ఇడీలే.
-ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ ఇక్కడే ఉంది. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఆహార పదార్థాలు.
-స్కిల్ డెవలప్‌మెంట్ కోసం దిశ పైలట్ ప్రాజెక్టు కింద వంద మంది మహిళలను నియమించుకున్నారు. ఇందులో 8 మంది ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
-లైఫ్ ఎట్ హోమ్ ఇన్ హైదరాబాద్ థీమ్‌తో రెండు పూర్తి స్థాయి ఇండ్లను ప్రదర్శిస్తున్నారు. ఇందులో వివిధ గదుల అలంకరణ అందుబాటు ధరలో ఆధునికతకు అద్దం పట్టేలా రూపొందించారు.
-ఈ స్టోర్ 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
KTR , IKEA , CEO Peter Betzel

Related posts

Leave a Comment