ఏలూరు నుంచి పవన్ పోటీ చేసినా సరే, గెలుపు నాదే: ఎమ్మెల్యే బడేటి బుజ్జి

టీడీపీపై పవన్ నిరాధార ఆరోపణలు తగదు
ఇలాంటి ఆరోపణలతో పవన్ తన విలువ కోల్పోతున్నారు
ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సరే, తానే గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్ తన విలువ కోల్పోతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. కాగా, ఏలూరులో ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్ కు బడేటి బుజ్జి బంధువు అవుతారు. బుజ్జి ఆధ్వర్యంలోనే ఈ వేడుకలు జరిగాయి.

Related posts

Leave a Comment