ఏపీలో కుక్కను మేకగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు: కన్నా విమర్శలు

  • ఏపీకి నాలుగేళ్లుగా కేంద్రం నిధులిస్తోంది
  • చంద్రబాబు ఏమో బీద పలుకులు పలుకుతున్నారు
  • ఏపీలో కార్యక్రమాలు కేంద్రం సహకారంతోనే జరుగుతున్నాయి

ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఈరోజు జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ఏపీకి నాలుగేళ్లుగా కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుంటున్న చంద్రబాబు, బీద పలుకులు పలుకుతున్నారని, ఏపీలో కుక్కను.. మేక అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీలో అన్ని కార్యక్రమాలు కేంద్రం సహకారం వల్లే జరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని, టీడీపీకి అభద్రతాభావం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మోదీని ఓడించాలన్న లక్ష్యంతో  దేశంలో భావసారూప్యతలేని పార్టీలన్ని కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. 2019 నాటికి ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని ఈ సందర్భంగా ఆమె పిలుపు నిచ్చారు.

Related posts

Leave a Comment