ఏపీలోనూ..ముందస్తు అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. ఊహించని రీతిలో ముందస్తు ఎన్నికలకు తరలేపి విజయకేతనం ఎగురవేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తనకు సాటిలేదని నిరూపించారు. అయితే ఏపీ లో చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనుల పట్ల ఆనందంగా ఉన్నారు ఏపీ ప్రజలు. దీంతో బాబు కూడా కేసీఆర్ వలె ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో బాబు మాట్లాడిన తీరు చూస్తుంటే.. ఇది నిజమేనేమో అనిపిస్తోంది.చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు హింట్స్ ఇచ్చారు. ఈ మేరకు తాజా రాజకీయ పరిణామాలపై పలు సూచనలు చేశారు. సంక్రాంతికి ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాబు.. గెలుపు ఏకపక్షం కావాలని, విమర్శించినోళ్ల నోరు మూయించాలని చెప్పుకొచ్చారు. జగన్ కు ఇప్పుడు ఓవైసీ దోస్త్ అయ్యారన్న బాబు.. మోడీ కనుసన్నలలో జగన్, ఒవైసీ ఇద్దరూ నడుచుకుంటున్నారని విమర్శించారు.ఈ 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థుల్ని కూడా ముందుగానే ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని, పార్టీలో గ్రూపులు కట్టకుండా పనిచేస్తే అందరికీ సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. మోడీ పాలన పై విరుచుకు పడుతూ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని గుర్తు చేశారు. ఇది చూస్తేనే బీజీపీ పై ప్రజా వ్యతిరేకత ఎంతఉందనేది తెలుస్తుందని చెప్పారు. ఇక ఈయన చెప్పిందంతా గ్రహించిన రాజకీయ విశ్లేషకులు.. కేసీఆర్ తరహాలోనే బాబు కూడా పక్కా వ్యూహం రచించి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!.
Tags: by polls in andhra pradesh, chandra babu naidu,janasena

Related posts

Leave a Comment