ఎర్రచందనం స్మగ్లింగ్ లో జబర్దస్త్ ఆర్టిస్టు…

అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ వేట!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్మగ్లర్ వరకూ ఎదిగాడు
సహ నటుడు హీరోగా చేస్తే ఫైనాన్స్ అందించాడు
పక్కా ఆధారాలు దొరకడంతో గాలిస్తున్న పోలీసులు
ఎలాగైనా నటుడిగా నిరూపించుకోవాలన్న లక్ష్యంతో దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వించిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్… అది నిన్నటి వరకూ. నేడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. అంతేకాదు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించగా, ఇటీవలే విడుదలైన చిత్రానికి ఫైనాన్స్ కూడా అందించాడు. తిరుపతికి చెందిన ఈ వ్యక్తి గురించి పక్కా ఆధారాలు లభ్యంకావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లోని బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని ఎర్రచందనం విక్రయిస్తూ డబ్బు సంపాదించాడు. ఇతనిపై 20 కేసులు నమోదు చేశామని చెప్పిన టాస్క్ ఫోర్స్ అధికారులు, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు, పల్లెల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగమైనట్టు గుర్తించిన పోలీసులు వారిని గురించి ఆరా తీస్తున్నారు.

Related posts

Leave a Comment