ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య షాక్‌కు గురిచేసింది: మంత్రి కేటీఆర్‌

హత్యాకాండపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌
ఇద్దరు నేతల కుటుంబాలకు నా సానుభూతి
2009-14 మధ్య సివేరి సోమకు అసెంబ్లీలో సహచరుడిని
విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో షాక్‌కు గురయ్యానని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘ఇద్దరు నేతల హత్యతో చాలా ఆవేదనకు గురయ్యా. సివేరి సోమ నాకు 2009-14 మధ్య అసెంబ్లీలో సహచరుడు. బాధాకరమైన ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు నేతల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment