ఎన్నారై చట్టాలను మరింత కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం

  • పెళ్లి చేసుకున్న 48 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • లేకపోతే పాస్ పోర్టు, వీసాల రద్దు
  • హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం

భారత ప్రభుత్వం ఎన్నారై చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎన్నారై వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత 48 గంటల్లోనే వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలని షరతు విధించింది. ఈ విషయాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. ఇండియాలో జరిగే పెళ్లిళ్లకు ఈ షరతు వర్తిస్తుందని ఆమె చెప్పారు. ఒకవేళ ఎవరైనా తమ పెళ్లిని నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోకపోతే… వాళ్ల పాస్ పోర్టు, వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఎన్నారైలు ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుని, భార్యలను ఇక్కడే వదిలి వెళ్లడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. ఈ మధ్య కాలంలో ఆరు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నారైల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే, కేంద్రం ఎన్నారై చట్టాలను మరింత కఠినతరం చేసింది.

Related posts

Leave a Comment