ఎనిమిది సంవత్సరాల వేట ఫలించింది… 600 కిలోల అతి భారీ మొసలి దొరికింది!

2010లో తొలిసారిగా కనిపించిన భారీ మొసలి
4.7 మీటర్ల పొడవున్న ఉభయచరం
ట్రాప్ చేసి పట్టిన ఆస్ట్రేలియా అధికారులు
ఆ భారీ ఉభయచరం కోసం జరిపిన ఎనిమిది సంవత్సరాల వేట ముగిసింది. 2010లో తొలిసారిగా కనిపించిన భారీ మొసలిని పట్టుకునేందుకు ఆస్ట్రేలియా అధికారులు ఎడతెగని ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించారు. దాదాపు 600 కిలోల బరువు, 4.7 మీటర్ల పొడవున్న ఈ మొసలిని కేథరిన్ పట్టణ శివార్లలో ట్రాప్ చేసి పట్టుకున్నామని అధికారులు నేడు తెలిపారు. దీని వయసు 60 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

దీన్ని పట్టుకోవడం చాలా కష్టమైందని ఏబీసీ వార్తా సంస్థకు సీనియర్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ జాన్ బుర్కే వెల్లడించారు. ఇంత పెద్ద మొసలిని తాను ఇంతవరకూ చూడలేదని, దీన్ని పట్టుకోవడం చాలా థ్రిల్ ను కలిగించిందని అన్నారు. దీన్ని జనావాసాలకు దూరంగా తరలించి రక్షిస్తామని చెప్పారు. వైల్డ్ లైఫ్ ఆపరేషన్స్ లో కేథరిన్ నది నుంచి ఇంత పెద్ద మొసలిని బంధించడం ఇదే తొలిసారని, ఈ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తున్న 250 మొసళ్లను ఇంతవరకూ బంధించామని అన్నారు.

Related posts

Leave a Comment