ఉన్నతవిద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులేమి లేవు. ఇదివరకు ఉన్న విధంగానే పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష ఫీజులో సైతం మార్పులేమి లేవు. క్రితంసారి ఉన్న విధంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పోటీ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జేఈఈ(మెయిన్), నీట్(యూజీ)లను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నారు. ఈ సదవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది. పరీక్షల నిర్వహణ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. పరీక్షా, షెడ్యూల్ విధానం ఈ విధంగా ఉంది.
1. యూజీసీ-నెట్.. డిసెంబర్‌లో నిర్వహణ.
– 01 సెప్టెంబర్,2018 నుంచి 30 సెప్టెంబర్, 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
– 02 డిసెంబర్, 2018 నుంచి 16 డిసెంబర్, 2018 మధ్యకాలంలో రెండు షిప్టుల్లో శని, ఆదివారాల్లో పరీక్ష నిర్వహణ. – 2019 జనవరి చివరివారంలో ఫలితాల వెల్లడి.

2. జేఈఈ(మెయిన్).. జనవరిలో 2019, ఏప్రిల్ 2019లో పరీక్ష నిర్వహణ.
ఏ) జనవరిలో నిర్వహించే పరీక్ష షెడ్యూల్..
– 09 సెప్టెంబర్,2018 నుంచి 30 సెప్టెంబర్,2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
– 06 జనవరి,2019 నుంచి 20 జనవరి,2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకోవచ్చు
– 2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి

బి) ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్ష షెడ్యూల్..
– 2019 ఫిబ్రవరి రెండోవారంలో దరఖాస్తుల సమర్పణ
– 07 ఏప్రిల్,2019 నుంచి 21 ఏప్రిల్,2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు
– 2019 మే నెల మొదటివారంలో ఫలితాల వెల్లడి.

3. నీట్(యూజీ).. ఫిబ్రవరి 2019, మే 2019 పరీక్ష నిర్వహణ
ఎ). ఫిబ్రవరి 2019 పరీక్ష
– 01 అక్టోబర్,2018 నుంచి 31 అక్టోబర్,2018 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ
– 03 ఫిబ్రవరి,2019 నుంచి 17 ఫిబ్రవరి,2019 మధ్యకాలంలో పరీక్ష నిర్వహణ
– 2019 మార్చి మొదటివారంలో ఫలితాల వెల్లడి
బి). మే 2019 పరీక్ష
– మార్చి 2019 రెండోవారంలో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ
– 12 మే, 2019 నుంచి 26 మే, 2019 మధ్యకాలంలో పరీక్ష నిర్వహణ
– 2019 జూన్ మొదటివారంలో ఫలితాల వెల్లడి

4. జనవరి 2019లో సీమ్యాట్, జీప్యాట్ పరీక్ష నిర్వహణ..
– 22 అక్టోబర్,2018 నుంచి 15 డిసెంబర్,2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
– 27 జనవరి,2019న పరీక్ష నిర్వహణ
– 2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి.

Related posts

Leave a Comment