ఉక్కు పరిశ్రమకు పునాది పడేవరకు గెడ్డం తీయను ఎంపీ సీఎం రమేశ్‌

తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్‌ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు.

Related posts

Leave a Comment