ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సిందట!

అజయ్ భూపతి దర్శకుడిగా ‘ఆర్ ఎక్స్ 100’
కార్తికేయ జోడీగా పాయల్ రాజ్ పుత్
ఈ నెల 12వ తేదీన విడుదల
రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి, ‘ఆర్ ఎక్స్ 100’ అనే సినిమాను రూపొందించాడు. కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ అనే కొత్త హీరో హీరోయిన్స్ తో ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన ప్రోమోస్ చూసినవాళ్లు .. ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగా అనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ సినిమానే విజయ్ దేవరకొండతో చేయాల్సిందని తాజా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి చెప్పాడు.

“కథను తయారుచేసుకున్న తరువాత ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించాను. ఈ కథ ఆయనకి బాగా నచ్చింది కూడా. అయితే అప్పటికే ఆయన కొన్ని సినిమాలకి సైన్ చేసేసి వున్నాడు. అయినా తప్పకుండా చేస్తాననీ .. కొంతకాలం వెయిట్ చేయమని చెప్పాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయాలంటే చాలా ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో నేను కొత్తవాళ్లతో చేసేశాను” అని అజయ్ భూపతి చెప్పుకొచ్చాడు. పోస్టర్స్ ను బట్టి .. ప్రోమోస్ ను బట్టి వయొలెంట్ లవ్ స్టోరీగా అనిపిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.

Related posts

Leave a Comment