ఈటీవీ కథనంపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌

కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడు జెడ్పీ ఉన్నత పాఠశాల వర్షం నీటికి మునకపై ఈటీవి ఆంధ్రప్రదేశ్ లో ప్రసారమైన కథనానికి కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, వైద్య-ఆరోగ్యశాఖ, పురపాలకశాఖ అధికారులను అక్కడకు వెళ్లాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీటిని మోటార్లతో తోడాలని ఆదేశించారు. స్కూలులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ ఆదేశాలతో అధికారులు పాఠశాలకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. అలాగే వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ మార్గాలకు మరమ్మతులు చేస్తున్నారు. వివిధ శాఖల సిబ్బంది ఈ పనులు నిర్వహిస్తున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు కలెక్టర్ తన వద్ద పనిచేసే అధికారి అంకాల్‌ను అక్కడికి పంపారు. ఇవాళ సాయంత్రానికల్లా నీటిని పూర్తిస్థాయిలో తోడేస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే భవిష్యత్తులో ముంపు సమస్య తలెత్తకుండా పాఠశాల ప్రాంగణం ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Related posts

Leave a Comment