ఇలాంటి వివాదాల్లోకి ఆడవాళ్లను లాగొద్దు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తనను ఈ విధంగా విమర్శించడం ఎందరినో బాధించిందని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు.

‘ఈ మధ్య జగన్‌ గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లను. అందులోనూ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు అస్సలు చేయను. ప్రజలకి సంబంధించిన పబ్లిక్‌ పాలసీల మీదే ఇతర పార్టీలతో విభేదిస్తాను కానీ నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరన్నా జగన్‌ను కానీ ఆయనకు సంబంధించిన కుటుం సభ్యులను, ఆయన ఇంటి ఆడపడుచులని ఈ వివాదంలోకి లాగవద్దని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి ఈ వివాదాన్ని అందరూ ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు పవన్‌.

Related posts

Leave a Comment