ఇదండీ మా ఇంట్లో వాళ్ల పరిస్థితి.. ఫొటో పోస్టు చేసిన అమితాబ్.. క్షణాల్లోనే వైరల్!

అలోచింపజేస్తున్న అమితాబ్ ఇంటి ఫొటో
అందరూ దగ్గరగానే.. అయినా దూరం దూరం‌
మొబైల్ ఆపరేటింగ్‌లో అందరూ బిజీ
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రా‌మ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. అందరి చేతా ‘ఔరా’ అనిపించే ఈ ఫొటోకు ఇప్పటికే లక్షలాది లైకులు వచ్చాయి.

అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ఆయన మొత్తం కుటుంబం అంటే.. చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. అందరూ ఒకే హాల్‌లో కూర్చుని ఉన్నారు. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. అందరూ ఒకే హాల్‌లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా, రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

కారణం.. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది. అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో ‌మొబైల్‌ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరచిపోయారు. ‘‘అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి’’ అంటూ అమితాబ్ తన ఫొటోకు క్యాప్షన్ రాశారు. అయితే, అందరూ స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతే ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం.

పెరుగుతున్న సాంకేతికత మనుషులను మౌనమునులుగా మారుస్తోందనడానికి ఈ ఫొటోను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చేమో!

Related posts

Leave a Comment