ఇండియాలో తొలిసారి… పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!

ఇండియాలో తొలిసారి... పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!
  • భువనేశ్వర్ లో చరిత్ర సృష్టించిన డీజిల్
  • పెట్రోలు కన్నా 12 పైసల ధర అధికం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం

భారతదేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోలు ధరను డీజిల్ అధిగమించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇది జరిగింది. ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కారణంగానే గతంలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి వచ్చిందని వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సాధారణంగా పెట్రోలు ధరతో పోలిస్తే, డీజిల్ ధర 10 శాతం వరకూ తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ, భువనేశ్వర్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 80.57కాగా, డీజిల్ ధర రూ. 80.69గా ఉంది. ఆయిల్ కంపెనీలపై పట్టు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడిందని ఒడిశా ఆర్థిక శాఖ మంత్రి శశిభూషణ్ బెహరా వ్యాఖ్యానించారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై పడి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

Related posts

Leave a Comment