ఇంట్లో వాళ్లు హెల్ప్ చేస్తారంటున్న అనుపమ

* సినిమా కథల ఎంపిక విషయంలో తన ఇంట్లో వాళ్లు హెల్ప్ చేస్తారని చెబుతోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ‘వాస్తవానికి నా దగ్గరకొచ్చే కథలన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. ఒక్కోసారి ఏది ఎంచుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ల హెల్ప్ తీసుకుంటాను’ అని చెప్పింది అనుపమ.
* బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. వ్యంగ్యాస్త్రాలతో కూడిన రాజకీయ కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని, వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుందని సమాచారం. ప్రముఖ రచయిత రత్నం దీనికి రచన చేస్తున్నారు.
* నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ను ప్రదానం చేసింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు.
* జగపతిబాబు, నారా రోహిత్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ‘ఆటగాళ్లు’ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts

Leave a Comment