ఆ రెండు పార్టీలు ఉగ్రవాదులకు అనుకూలమే: సుబ్రహ్మణ్యస్వామి

పీడీఎఫ్, కాంగ్రెస్ లు ఉగ్రవాదులకు అనుకూల పార్టీలు
వీటి పొత్తు బీజేపీకే లాభం
కశ్మీర్ కు మాత్రం నష్టం చేకూర్చుతుంది
పీడీఎఫ్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఉగ్రవాదులకు అనుకూలమే అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే… అందొక చెత్త ఐడియా అవుతుందని చెప్పారు. పీడీపీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుంటే బీజేపీకే మేలు కలుగుతుందని చెప్పారు. అయితే, కశ్మీర్ కు మాత్రం చేటును కలిగిస్తుందని… ఎందుకంటే తాము అక్కడ ఉగ్రవాదులను ఏరివేస్తున్నామని అన్నారు. మరోవైపు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, కాంగ్రెస్ తో పొత్తు వార్తలను ఖండించారు.

Related posts

Leave a Comment