ఆ గొంతు చంద్రబాబుదే.. గౌరవంగా తప్పుకోవడం మంచిది: సి.రామచంద్రయ్య

ఓటుకు నోటు కేసులో ఆ గొంతు చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది
సీఎం పదవి నుంచి చంద్రబాబు గౌరవంగా తప్పుకుంటే మంచిది
నేరాలు, ఘోరాలు చేసి… ఇప్పుడు ర్యాలీలు చేస్తారా?
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని… ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు గౌరవంగా తప్పుకోవడం మంచిదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య సూచించారు. నిన్న చంద్రబాబు చేపట్టిన ర్యాలీ ప్రభుత్వానిదా? లేక టీడీపీదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు నేరాలు, ఘోరాలు చేసి… ఇప్పుడు ర్యాలీలు చేస్తారా? అని మండిపడ్డారు. కాల్ మనీ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3,000 అత్యాచార ఘటనలు జరిగాయని… వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు రక్షణ కల్పిస్తున్న చంద్రబాబు… మహిళలకు రక్షణ కల్పిస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.

Related posts

Leave a Comment