ఆస్తులు ప్రకటించని ఎంపీల జాబితాలో టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలు

TDP,YSRCP and TRS party leaders didnt tel properties details till

ఆస్తులు ప్రకటించని ఎంపీల జాబితాలో ఏపీ, తెలంగాణ నేతలు కూడా ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతూ ఆస్తులు ప్రకటించని వారి జాబితా కావాలంటూ రచనా కల్రా అనే సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా వివరాలు అడగ్గా ఈ విషయం వెల్లడైంది.

లోక్‌సభ, రాజ్యసభలో కలిసి మొత్తం 94 మంది ఎంపీలు తమ ఆస్తుల వివరాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీరిలో 65 మంది లోక్‌సభ ఎంపీలు కాగా, 29 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ తెలంగాణకు చెందిన కొందరు టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆస్తులు ప్రకటించలేదు. టీడీపీ, టీఆర్ఎస్‌ నుంచి ఏడుగురు చొప్పున ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఆస్తులు ప్రకటించలేదు.
Tags: TDP,YSRCP party,leaders,properties,details

Related posts

Leave a Comment