ఆసక్తిని రేపుతోన్న ‘గూఢచారి’ టీజర్

అడివి శేష్ హీరోగా ‘గూఢచారి’
కథానాయికగా శోభిత ధూళిపాళ
ఆగస్టు 3వ తేదీన విడుదల
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘గూఢచారి’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయికగా శోభిత ధూళిపాళ నటించింది. అభిషేక్ పిక్చర్స్ వారు .. విస్టా డ్రీమ్ మర్చంట్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ను ఆవిష్కరిస్తూ సాగిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ సినిమాను రూపొందించారనే విషయం ఈ టీజర్ చూడగానే తెలిసిపోతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమా ద్వారా సుప్రియ యార్లగడ్డ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related posts

Leave a Comment