ఆర్ బీఐ బాటలోనే… రుణాలపై రేట్లను పెంచేసిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

  • అన్ని రకాల రుణాలపై 10 బేసిస్ పాయింట్ల పెంపు
  • ఆర్ బీఐ పరపతి విధాన సమీక్ష తర్వాత రేట్లను పెంచిన తొలి సంస్థ
  • కొత్త రుణాలతోపాటు, పాత వాటిపైనా వడ్డీ భారం

భారత రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచిన మరుసటి రోజే ప్రైవేటు రంగ అగ్రగామి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సైతం రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. రుణాలపై ఎంసీఎల్ఆర్ ఆధారంగానే వడ్డీ రేట్లను బ్యాంకులు ఖరారు చేస్తుంటాయి. దీంతో కొత్తగా  తీసుకునే రుణాలకే కాకుండా, ఇప్పటికే తీసుకున్న వారిపైనా పావు శాతం వరకు భారం పడే అవకాశం ఉంది. ఆర్ బీఐ రేట్ల పెంపు తర్వాత ఆ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి బ్యాంకు ఇదే. ఆర్ బీఐ నిన్న రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం పెంచుతూ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటును రివర్స్ రెపోగాను, అదే బ్యాంకులు ఆర్ బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించాల్సిన  రేటును రెపోగాను పరిగణిస్తారు.

Related posts

Leave a Comment