ఆకాశాన్ని తాకనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

  • ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతుందన్న కేంద్ర మంత్రి
  • అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమన్న ధర్మేంద్ర ప్రదాన్
  • అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలతో వాహదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వాహనదారుల వీపులు విమానం మోత మోగనున్నాయి. డీజిల్ రేట్ల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా చుక్కలను తాకనున్నాయి. ఈ మేరకు సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, అమెరికన్ డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో… ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న కారణాలే పెట్రో ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు.

నిన్ననే గరిష్ట స్థాయులకు చేరుకున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరింత పెరిగాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.59కి చేరుకుంది. ఈ ధర సెంచరీ కొట్టడానికి ఇంకెంతో కాలం పట్టేలా లేదు. మరోవైపు, పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల పట్ల వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Leave a Comment