అవినీతి లేని పరిశ్రమ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమ ఒక్కటే

‘‘అవినీతి లేని పరిశ్రమ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమ ఒక్కటే’’ అన్నారు రామ్‌చరణ్‌. ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మాత. నాగబాబు సమర్పిస్తున్నారు. విశాల్‌ – శేఖర్‌ స్వరాలు సమకూర్చారు. మే 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వేడుకని ఉద్దేశించి అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘నిజాయతీతో కూడిన ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాడు బన్నీ. దర్శకుడు వక్కంతం వంశీ కథ చెప్పగానే ఈ సినిమా కోసం నేరుగా సెట్స్‌కి వెళ్లి ఉత్సాహంగా సినిమా చేశాడు. ఈ చిత్రం దాసరి నారాయణరావు పుట్టినరోజున విడుదలవుతుండటం మాకు గర్వంగా ఉంది. సినిమా పరిశ్రమలో ఈమధ్య మనసుకు బాధకలిగించేలా, పరిశ్రమలో ఉన్న అందరూ ఎంతోకొంత మధన పడేలా కొన్ని విషయాలు జరిగాయి.

వాటిపై కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చింది. దాంతో కొంతమంది ఈ సినిమాని విమర్శించడానికో, మిశ్రమ స్పందన తీసుకురావడానికో ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుక వెనకాలే కొన్ని సంఘటనలు జరిగాయి. దాంతో ఒక నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది’’ అన్నారు. అల్లు అర్జున్‌ని ఉద్దేశించి ‘బన్నీ ఆ విషయాన్ని నీకు తర్వాత చెబుతాను’ అని వ్యాఖ్యానించారాయన. అనంతరం రామ్‌చరణ్‌ కొనసాగిస్తూ ‘‘బన్నీ అంకితభావం, ఆకలి, ప్రతిభ గురించి సినిమాల్లోకి రాక ముందు నుంచీ చూస్తూనే ఉన్నాం. చిన్నప్పట్నుంచీ ఇంట్లో వేడుకల్లో మా అందరికీ వినోదం పంచే వ్యక్తి తనే. అంత ఉత్సాహం తనలో ఉండేది. బన్నీ డ్యాన్స్‌ చూసి నువ్వు నేర్చుకోరా అనేవారు మా నాన్న. ‘చిరుత’ మొదలు కాకముందు ‘వీడికి డ్యాన్స్‌ వచ్చా? ఎప్పుడూ చేయలేదు’ అని అడిగితే… ‘ప్రైవేటుగా చాలా బాగా డ్యాన్స్‌ చేస్తాడ’ని నా గురించి మా నాన్నకి ధైర్యమిచ్చిన వ్యక్తి బన్నీనే. అర్థవంతమైన, వాణిజ్య ప్రధానమైన సినిమాలంటే తమిళంవైపు చూస్తుంటాం. అలాంటి సినిమాల కోసం తమిళ దర్శకులతో పనిచేయాలని ప్రయత్నించేవాళ్లం. కానీ తెలుగులోనూ అలాంటి సినిమాలొస్తున్నాయిప్పుడు.

మనమంతా గర్వపడే స్థాయిలో ఉంది మన చిత్ర పరిశ్రమ. దానికి మరో ఉదాహరణ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. చాలా నిజాయతీగా తీసిన సినిమా ఇది. నా ‘ఎవడు’ సినిమా రాసింది ఈ దర్శకుడే. ఆయన రచన చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్మీ నేపథ్యంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నా. నా సోదరుడు అల్లు అర్జున్‌ ఆ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. బన్నీ ఆత్మసంతృప్తి కోసమని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులో భాగమే గోనగన్నారెడ్డి పాత్ర. చిన్న పాత్రే అయినా దానికి ఎన్నో ప్రశంసలు, పురస్కారాలొచ్చాయి. అలాంటి ఘాఢత ఉన్న పాత్రలో రెండున్నర గంటలు కనిపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. దీనికి ఇంకెన్ని పురస్కారాలొస్తాయో ఊహించొచ్చు’’ అన్నారు. అంతకుముందు అల్లు అరవింద్‌ ప్రస్తావించిన విషయంపై స్పందిస్తూ ‘‘మామ మాటల వెనకాల బాధని అర్థం చేసుకొంటాన్నేను. దర్శకుడు, నటుడు, నిర్మాత, సాంకేతిక నిపుణులు… అందరూ కూడా ఒళ్లు హూనం చేసుకొని కష్టపడతాం. మళ్లీ ఇంటికొచ్చి తర్వాత రోజు ఏం చేయాలో ఆలోచిస్తుంటాం.

Related posts

Leave a Comment