అల్లు అర్జున్ దాతృత్వం .. కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం!

భారీ వర్షాల కారణంగా స్తంబించిన జనజీవనం
మోహన్ లాల్ కూడా రూ.25 లక్షల విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురి విరాళం
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, హీరోలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సీఎం సహాయనిధికి చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి కమలహాసన్ రూ.25 లక్షల విరాళం అందజేయగా, తాజాగా అల్లు అర్జున్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. కాగా, కేరళలో భారీ వర్షాల కారణంగా వేల ఇళ్లు, పలు రోడ్లు దెబ్బతిన్నాయి.

Related posts

Leave a Comment