అలసిపోయారు.. రండి.. మా రాష్ట్రంలో సేదదీరండి!

కర్ణాటక కొత్త ఎమ్మెల్యేలకు కేరళ టూరిజం శాఖ ఆహ్వానం
ఓ ట్వీట్ చేసిన కేరళ టూరిజం శాఖ
ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలలో పాల్గొని అలసిపోయారు
ఎంతో అందమైన, సురక్షితమైన మా రిసార్ట్స్ లో సేదదీరండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇన్నాళ్లూ ప్రచారాలు నిర్వహించి పలు పార్టీల అభ్యర్థులు ఎంతో అలసిపోయారు. నేటి ఎన్నికల ఫలితాలతో విజయం సాధించిన అభ్యర్థులు సంతోషంలో మునిగితేలుతున్న తరుణంలో కేరళ టూరిజం శాఖ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ ఈ ట్వీట్ చేసింది.

ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, రోడ్ షో లలో పాల్గొని ఎంతో అలసిపోయారు కనుక, కొంత సేదదీరేందుకు పర్యాటక ప్రాంతమైన తమ రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించింది. ఎంతో అందమైన, సురక్షితమైన తమ రిసార్ట్స్ లో సేదదీరాల్సిందిగా కోరింది. దీనిపై కొత్త ఎమ్మెల్యేల స్పందన సంగతి అలా ఉంచితే, నెటిజన్లు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేశారు. కేరళ టూరిజం శాఖ ఆలోచన అద్భుతమని కొందరు, కొత్త ఎమ్మెల్యేలను అక్కడికి పిలిపించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా! అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించారు.

Related posts

Leave a Comment