‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ లో ఛాన్స్ దక్కించుకున్న కుర్ర హీరోయిన్

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ ఓ సంచలనం
తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్
ధృవ్ జోడీగా శ్రియా శర్మ
తెలుగు ప్రేక్షకులను పలకరించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్లతో కొత్త రికార్డులను సృష్టించి .. ఇతర భాషల దర్శక నిర్మాతలను సైతం ఆకర్షించింది. దాంతో ఆయా భాషలలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలా తమిళంలో ఈ సినిమా రీమేక్ కు రెడీ అవుతోంది.

తమిళ సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా ఈ సినిమాను రూపొందించడానికి దర్శకుడు ‘బాలా’ సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి ‘వర్మ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తమిళంలోను కథానాయికగా షాలినీ పాండే చేయనుందని అనుకున్నారు. కానీ తాజాగా శ్రియా శర్మ పేరు వినిపిస్తోంది. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రియా శర్మ పరిచయమైంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ లో శ్రియా శర్మ ఎంపిక ఖరారైతే, ఈ సినిమా అక్కడ ఆమెకి ఒక రేంజ్ లో బ్రేక్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

Leave a Comment