అమెరికా .. మలేసియాల్లో దూసుకుపోతోన్న ‘కాలా’

తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరి వసూళ్లు
చెన్నైలో రికార్డు స్థాయి వసూళ్లు
ఓవర్సీస్ లోను అదే జోరు
భారీ అంచనాల మధ్య రజనీకాంత్ ‘కాలా’ థియేటర్లకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, తమిళనాట తన జోరు చూపిస్తోంది. ఒక్క చెన్నైలోనే ఈ సినిమా తొలివారంలో 8.24 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది.

అమెరికాలో ఈ సినిమా తొలివారంలో 13.5 కోట్లను వసూలు చేసింది. ఇక మలేసియాలో రజనీకి గల క్రేజ్ ను గురించి తెలిసిందే. అక్కడ తొలివారంలో ఈ సినిమా 7.61 కోట్లను రాబట్టింది. అన్ని చోట్ల ఈ సినిమాకి వచ్చింది మిశ్రమ స్పందనే .. అయినా రజనీకి గల క్రేజ్ ఈ సినిమాను వసూళ్ల పరంగా పరుగులు తీయిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఉత్తరా ఖండ్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

Related posts

Leave a Comment