అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

న్యూయార్క్‌: అమెరికాలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కనీసం 20 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒక కారు ప్రమాదం జరిగిన తరువాత పాదచారులపైకి దూసుకెళ్లడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది. న్యూయార్క్‌ రాష్ట్ర రాజధాని అల్బానీ సమీపంలోని షోహారీ కౌంటీలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎస్‌యూవీ మోడల్‌ కారు సమీపంలోని ఓ కేఫ్‌లోకి చొచ్చుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఆ కారులో కొందరు పెళ్లి విందుకు వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతుల్లో కార్లలో ప్రయాణిస్తున్నవారెందరు? పాదచారులెందరున్నారో ఇంకా వెల్లడికాలేదు. కానీ కేఫ్‌ బయట పలువురి మృతదేహాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

Related posts

Leave a Comment