అమెరికాలోని భారతీయుడి ఇంట్లో 1000 చైల్డ్ పోర్న్ వీడియోలు..

  • అభిజిత్ నుంచి వెయ్యికిపైగా వీడియోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • దోషిగా తేలడంతో శిక్ష ఖరారు
  • జైలు నుంచి విడుదలయ్యాక కూడా పదేళ్ల పర్యవేక్షణ

చిన్నపిల్లల నీలి చిత్రాలు కలిగి ఉన్నాడన్న కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు భారతీయుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, విడుదలయ్యాక కూడా అతడిపై పదేళ్లపాటు పర్యవేక్షణ కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.

పిట్స్‌బర్గ్‌కు చెందిన అభిజిత్ దాస్(28) వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన 1000 వీడియోలను గుర్తించినట్టు అటార్నీస్కాట్ బ్రాడీ తెలిపారు. అతడి వద్ద ఉన్న మొత్తం వీడియోల్లో 380 చిన్నారులవేనని ఆయన కోర్టుకు వివరించారు. నేరం నిరూపణ కావడంతో అభిజిత్‌కు 52 వారాల జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మరో 10 ఏళ్లపాటు అతడిపై పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Related posts

Leave a Comment