అభిమానుల కోసం అలసటను లెక్కచేయని చిరూ

‘సైరా’ షూటింగులో చిరంజీవి
డిసెంబర్ నాటికి చిరూ పోర్షన్ పూర్తి
జనవరి నుంచి కొరటాలతో సెట్స్ పైకి
కొంతకాలంగా చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన ఆంగ్లేయులపై పోరాడే యోధుడుగా కనిపించనున్నారు. కథాపరంగాను .. ఖర్చు పరంగాను ఈ సినిమా భారీతనంతో కూడినది. అందువలన చిరంజీవి ఎంతో శ్రమకోర్చి ఈ షూటింగులో పాల్గొంటున్నారట.

ఇటీవల ఒకవైపున మండుటెండల్లోను .. మరో వైపున లైట్ల వేడిని తట్టుకుంటూ ఆయన యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా చిరూ అలసటకు లోనవుతున్నా, అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో అలసటను లెక్కచేయలేదట. ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ నాటికి చిరంజీవి పోర్షన్ ను పూర్తి చేస్తారట. ఆ తరువాత మిగతా సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. జనవరి నుంచి కొరటాల సినిమాతో చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల నిమగ్నమై వున్నాడట.

Related posts

Leave a Comment