‘అభిమన్యుడు’ రిలీజ్ డేట్ ఖరారు

చిరంజీవితోనే కొరటాల తదుపరి సినిమా
వాయిదా పడిన ‘నా నువ్వే’ విడుదల
అమెరికాలో రవితేజ రెండు నెలలు
* విశాల్, సమంత జంటగా నటించిన ‘ఇరుంబుతిరై’ తమిళ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరిట తెలుగులోకి అనువదించారు. సైబర్ నేరాల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ ఒకటిన రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
* ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించే చిత్రంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందన్నది తాజా సమాచారం. వచ్చే జనవరిలో ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
* కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ చిత్రం విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఇది విడుదల కావలసి వుంది. అయితే జూన్ ఒకటికి దీని విడుదలను వాయిదా వేసినట్టు తాజా సమాచారం.
* రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పేరుతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం రవితేజ రెండు నెలల పాటు ఏకధాటిగా అమెరికాలోనే ఉంటాడట.

Related posts

Leave a Comment