అనుకోకుండా హైదరాబాద్ లో దిగి.. టాక్సీ మాట్లాడుకుని…!

  • 1980 దశకంలో బీజేపీ అధ్యక్షుడిగా వాజ్ పేయి
  • బెంగళూరు వెళుతూ మధ్యలో హైదరాబాద్ లో ఆగిన విమానం
  • ఆ సమయంలో నగరంలో హెగ్డేవార్ శతజయంతి వేడుకలు
  • విషయం తెలిసి విమానం దిగేసిన వాజ్ పేయి

ఇది 1980 దశకం నాటి సంగతి. అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1980 నుంచి 1986 వరకూ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టాక్సీ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన కర్ణాటకలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సిన నిమిత్తం విమానంలో బయలుదేరగా, మార్గమధ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో విమానం ఆగింది. ఆ సమయంలో హైదరాబాద్ లో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారని వాజ్ పేయికి ఎవరో చెప్పారు. వెంటనే ఆయన విమానం దిగి, బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకుని ఉత్సవాలు జరిగే ప్రాంతానికి రాగా, నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Related posts

Leave a Comment