అదుర్స్ అనిపించేలా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్టు లుక్

మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ 
కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
ఆగస్టులో భారీస్థాయిలో రిలీజ్
నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జోడీగా దర్శకుడు మారుతి ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను రూపొందించాడు. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మితమైంది. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శైలజా రెడ్డిగా కీలకమైన పాత్రను రమ్యకృష్ణ పోషించారు. కథలో ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే ఫస్టులుక్ పోస్టర్ లోను ఆమెను హైలైట్ చేశారు.

కథలో ప్రధానంగా కనిపించే మూడు పాత్రలను కవర్ చేస్తూ ఈ ఫస్టులుక్ పోస్టర్ ను డిజైన్ చేశారు. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ హ్యాపీ మూడ్ లో వుంటే, అది తట్టుకోలేకపోతున్న ఎక్స్ ప్రెషన్ తో రమ్యకృష్ణ కనిపిస్తోంది. తనమాటే నెగ్గాలనే అత్త .. అందుకు తగిన కూతురు .. ఇద్దరికీ పగ్గాలు వేసే అల్లుడు కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే కథ అదే తరహాలో సాగినా కొత్త ట్విస్టులు వుంటాయని చెబుతున్నారు. ఒకప్పుడు పొగరుబోతు అత్త పాత్రలను వాణిశ్రీ అద్భుతంగా పండించారు. ఇప్పుడు ఆ స్థానంలో రమ్యకృష్ణ అదరగొట్టేయనున్నారన్న మాట. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

Related posts

Leave a Comment