అత్యుత్తమ అమెరికా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే..!

ఒబామానే అత్యుత్తమ అధ్యక్షుడు
మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం ఇదే
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు నాలుగో స్థానం
అమెరికా అధ్యక్షుల్లో ఇప్పటి వరకు పనిచేసిన వారిలో అత్యుత్తమమైన వారు ఎవరన్న దానిపై జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన బరాక్ ఒబామానే అత్యుత్తమైన అధ్యక్షుడని అత్యధికమంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. ఒబామానే బెస్ట్ ప్రెసిడెంట్ అని 44 శాతం మంది అభిప్రాయపడగా, బిల్ క్లింటన్‌కు 33 శాతం మంది ఓటేశారు. రొనాల్డ్ రీగన్ 32 శాతంతో మూడో స్థానంలో నిలవగా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు 19 శాతం ఓట్లు వచ్చాయి.

జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్య ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ సర్వే నిర్వహించింది. జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షుల్లో అత్యుత్తమమైన వారు ఎవరన్న ప్రశ్న సంధించగా 2,002 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదటి, రెండో ప్రాధాన్యత క్రమంలో సర్వే నిర్వహించగా మొదటి ప్రాధాన్యంగా 31 మంది, రెండో ప్రాధాన్యం కింద 13 మంది ఒబామాకు జై కొట్టారు. దీంతో ఆయన 44 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. ట్రంప్‌కు పది శాతం మంది తొలి ప్రాధాన్యం ఇవ్వగా, 9 శాతం మంది రెండో ప్రాధాన్యం ఇచ్చారు.

Related posts

Leave a Comment