అజ్ఞాతవాసి ఇబ్బందులు ఎక్కువయ్యాయా..రానా సాయం..?

Rana Helps To Agnyaathavaasi

అజ్ఞాతవాసి చిత్రం పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయినట్లు ఉదయం నుంచి అటు ఫిలిం సర్కిల్స్ లో, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం లార్గో వించ్ అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా రూపొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ చిత్ర రీమేక్ హక్కులని ప్రముఖ టి – సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అజ్ఞాతవాసి చిత్రంలో లార్గో వించ్ లోని సన్నివేశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో టి సిరీస్ సంస్థ నిర్మాతకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. కాగా హీరో రానాకు టి సిరీస్ సంస్థ తో మంచి సాన్నిహిత్యం ఉందని, ఈ సమస్యని పరిష్కరించడానికి రానా ముందడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏ మేరకు వాస్తవం ఉందొ తెలియాలంటే అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

Tgas: T series,rana daggupati,agnathavasi,film nagar,larko vinch movie

Related posts

Leave a Comment