అందుకోసం.. కొంచెం బరువు కూడా తగ్గాల్సి వచ్చింది : హీరోయిన్ రెజీనా

తమిళ చిత్రం‘ చంద్రమౌళి’లో బీచ్ సాంగ్ కోసం బికినీ ధరించా
నేను బికినీ ధరించిన తొలి సినిమా ఇదే
బికినీ ధరించాలంటే ఫిజిక్ కరెక్టుగా ఉండాలి
అందుకోసమే నేను కొంచెం బరువు తగ్గా
గౌతమ్ కార్తీక్, రెజీనా జంటగా కలిసి నటించిన తమిళ చిత్రం ‘చంద్రమౌళి’. తిరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనా ఆసక్తికర విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతవరకూ ఏ సినిమాలో కూడా తాను బికినీ ధరించి నటించలేదని, అయితే, ‘చంద్రమౌళి’లో మాత్రం బికినీ వేసుకోవాల్సి వచ్చిందని.. అలా ధరించడం ఇదే తనకు మొదటిసారని చెప్పింది. చంద్రమౌళి చిత్రంలో ఓ బీచ్ సాంగ్ కోసం బికినీ ధరించమని దర్శకుడు తిరు చెప్పినప్పడు, మొదట్లో తాను అంగీకరించలేదని చెప్పింది. బికినీ ధరిస్తేనే ఆ పాట షూట్ చేస్తానని, లేకపోతే చేయనని తిరు పట్టుబట్టి మరి తనతో ఒప్పించారని చెప్పింది. ఎవరైనా బికినీ ధరించాలంటే ఫిజిక్ కరెక్టుగా ఉండాలని, ఇది ధరించడం కోసం తాను కొంచెం బరువు కూడా తగ్గాల్సి వచ్చిందని రెజీనా చెప్పింది. అయితే, బీచ్ సాంగ్ లో బికినీ ధరించింది కదా అని చెప్పి అసభ్యకర దృశ్యాలు ఉన్నాయని అనుకోవద్దని, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాటను తిరు షూట్ చేశారని రెజీనా చెప్పుకొచ్చింది.

Related posts

Leave a Comment