అందాలతార సోనాలి బింద్రేకు ‘హై గ్రేడ్’ కేన్సర్.. పోరాడతానంటున్న సోనాలి!

శరీరంలో ఇతర అవయవాలకూ వ్యాపించింది
వైద్యుల సూచనతో న్యూయార్క్ లో చికిత్స
ఆశను కోల్పోలేదు… వ్యాధిపై పోరాడతానని ట్వీట్
తనకు హై గ్రేడ్ కేన్సర్ (తీవ్ర స్థాయిలో) వ్యాధి ఉందని నిర్ధారణ అయినట్టు ప్రముఖ నటి సోనాలి బింద్రే ప్రకటించింది. ఎన్నో తెలుగు, బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించిన బింద్రే ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విషయం గమనార్హం.

‘‘కొన్ని సందర్భాల్లో తక్కువగా ఊహించినప్పుడు అనుకోనివి జరుగుతుంటాయి. హై గ్రేడ్ కేన్సర్ నాకున్నట్టు ఇటీవలే తేలింది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది. అదే పనిగా నొప్పి వేధిస్తుండడంతో పరీక్షలు నిర్వహించగా ఊహించనది బయపడింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు మద్దతుగా నిలిచారు. అందరికీ ధన్యావాదాలు’’ అని బింద్రే ట్వీట్ చేసింది.

తాను ఆశను కోల్పోలేదని, వ్యాధిపై పోరాటం చేస్తానని ధైర్యంగా చెప్పింది. ‘‘వెంటనే సత్వర చర్యలు తీసుకోవడం మినహా చేసేదేమీ లేదు. కనుక వైద్యుల సూచన మేరకు న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నాను. ఆశాభావంతో వ్యాధిపై పోరాడతా’’ అని పేర్కొంది.

Related posts

Leave a Comment