కాంగ్రెస్ ను విమర్శించారు.. మరి మీ బాధ్యత ఏమైంది?: మోదీపై చంద్రబాబు ఫైర్

80 హామీలు ఇచ్చారు… ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఏపీకి తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి ఎవరు కారణం? తల్లిని ఇప్పటికైనా బతికించమని కోరుతున్నాం వాజ్ పేయి హయాంలో తమకు 29 మంది ఎంపీలు ఉన్నారని… తాము ఎన్డీయేలో ఉన్నప్పటికీ ఒక్క మంత్రి పదవిని కూడా అడగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లోక్ సభ స్పీకర్ పదవిని మాత్రమే తీసుకున్నామని… ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసమే ఆ పదవిని తీసుకున్నామని చెప్పారు. కేబినెట్ లోకి చేరడానికి తాము ఒప్పుకోలేదని తెలిపారు. కానీ, రెండు పార్టీలు ఎంతో సహకారంతో కలసి పని చేశాయని చెప్పారు. అదే నమ్మకంతో ఈసారి కూడా ఎన్డీయేలో చేరామని… తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారని… అయితే రకరకాల కారణాలు చెబుతూ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారని…

ఇంకా ఉంది

రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాం: ఏపీ మంత్రి అఖిలప్రియ

టీడీపీ ఎంపీలను అభినందించిన అఖిలప్రియ రాజ్యాంగంపై ఉన్న విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసింది  రాష్ట్ర భవిష్యత్తు కోసం మరింత గట్టిగా నిలబడతాం ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుగు దేశం పార్టీ ఎంపీలు నిన్న పార్లమెంట్ లో ఆవిష్కరించిన విధానాన్ని ఏపీ మంత్రి అఖిలప్రియ ప్రశంసించారు. రాజ్యాంగంపై ప్రజలకున్న చిన్నపాటి విశ్వాసాన్ని, ఆశను నరేంద్ర మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా గట్టిగా నిలబడి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె అన్నారు.

ఇంకా ఉంది

అది వైఎస్ఆర్ ట్రాప్ కాదన్నా… ట్రాక్ అనుకోవాలి!: జగన్

వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడిపోయిందన్న ప్రధాని తాము నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నామన్న జగన్ ఒత్తిడి వచ్చేసరికి టీడీపీ ట్రాక్ మార్చుకుందని ఎద్దేవా “తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాప్ లో పడిపోయింది” అని నిన్న లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా, వైఎస్ జగన్ స్పందించారు. “ఇంతకుముందు చెప్పినదే అన్నా. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర సంవత్సరాలుగా మేము చెబుతున్నదే. అభిజిత్ సేన్ రాసిన లేఖ, వైవీ సుబ్బారెడ్డి రాసిన లేఖ, ఈ జీఎస్టీలో స్పెషల్ ప్రొవిజన్స్… ఇవన్నీ చూపిస్తూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం. ఈ చంద్రబాబునాయుడు గారికి, ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి, ఎన్నికలు దగ్గర పడేసరికి… టీడీపీ…

ఇంకా ఉంది

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

కేటీఆర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేత విజయ్ దేవరకొండను అభినందించిన కేటీఆర్ వేర్వేరు ట్వీట్లు చేసిన కేటీఆర్, విజయ్ టాలీవుడ్ యువనటుడు విజయ్ దేవరకొండ తన తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారమే, విజయ్ దేవరకొండ ఆ డబ్బును అందజేశారు. విజయ్ దేవరకొండ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసి ఈ చెక్కును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను కేటీఆర్ అభినందించి, ఓ మొక్కను అందజేశారు. తెలంగాణలో జరగనున్న నాల్గో విడత హరితహారంలో, జలం-జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఇంకుడు గుంతల నిర్మాణంలో విజయ్ ని పాల్గొనాలని కోరారు. ఆయా విషయాలపై ప్రజలను చైతన్య పరచాలని…

ఇంకా ఉంది

త్రిష మళ్లీ భయపెట్టడానికి వచ్చేస్తోంది

హారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతోన్న త్రిష  గతంలో వచ్చిన ‘కళావతి’ .. ‘నాయకి’ తాజాగా థియేటర్లకు రానున్న ‘మోహిని’ తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన త్రిష, ఇటీవల నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఎక్కువగా చేస్తోంది. నయనతార మాదిరిగా హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇంతకుముందు ‘కళావతి’ .. ‘నాయకి’ వంటి హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసిన త్రిష, తాజాగా హారర్ కామెడీ నేపథ్యంలో సాగే ‘మోహిని’ సినిమా చేసింది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ‘మోహిని’కి మాదేష్ దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా .. క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా…

ఇంకా ఉంది